నిరుద్యోగులకు సదవకాశం… పుణ్యం-పురుషార్థం అన్నట్టుగా ఉద్యోగంతోపాటు దేశంపట్ల బాధ్యతను నెరవేర్చుకోగలిగే అవకాశం. భారత సైన్యంలో చేరాలనుకునే యువత కోసం ఈ నెల 28 నుంచి సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు రక్షణశాఖ అధికారులు తెలిపారు. 125 ఇన్‌ఫ్యాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ ఆర్మీ)లో 69,123లో 10 కలిపి మొత్తం 79 వివిధ క్యాటగిరీల్లోని సైనిక ఉద్యోగాల ఖాళీలకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
జోన్ 6లో భాగంగా తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, గోవా రాష్ర్టాల యువత అర్హులని చెప్పారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల అభ్యర్థులకు ఈ నెల 28 ఉదయం 5 గంటల నుంచి హైదరాబాద్, మౌలాలిలోని 1105, రైల్వే ఇంజినీర్ (టెరిటోరియల్ ఆర్మీ) ప్రాంతంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్టు చెప్పారు. 18 నుంచి 42 ఏండ్ల మధ్య వయసున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అదనపు సమాచారం కోసం 125 ఇన్‌ఫ్యాంట్రీ బెటాలియన్, ది గార్డ్స్, తిరుమలగిరి, సికింద్రాబాద్ చిరునామాలో సంప్రదించాలని సూచించారు.
ముస్లింలు సొంతంగా రాజకీయ వేదికను సిద్ధం చేసుకోవాలి: ఒవైసీ పిలుపు