గౌతమ్ తిన్ననూరి సినిమాకు దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న చిత్రం “జెర్సీ”. ఈ చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నారు. 1990ల కాలం నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాని పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న “జెర్సీ” చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లను చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసింది. ఇందులో ఆయన అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది.
క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పుడే క్రికెటర్ రమణ్ లంబా జీవితం ఆధారంగా రూపొందుతుందనే టాక్ వచ్చింది. రమణ్ లంబా క్రికెట్ ఆడుతుండగా తలకి బాల్ తగిలి చనిపోయాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో నాని పాత్ర కూడా అదే విధంగా చనిపోతుందనేది ఫిల్మ్ నగర్ లో తాజాగా విన్పిస్తున్న మాట. సాధారణంగా హీరో చనిపోయే కథలు తెలుగు ప్రేక్షకుల నచ్చవనే చెప్పాలి. ఎందుకంటే క్లైమాక్స్ విషాదాంతంగా ఉండే సినిమాలేవీ తెలుగులో హిట్ కాలేదు. కానీ సహజంగా ఉండడం కోసం దర్శకుడు నెగెటివ్ క్లైమాక్స్ ను చిత్రీకరించాడని, కొత్తగా, కథకి తగిన ముగింపు అనే ఉద్దేశంతో నాని కూడా ఓకే చెప్పేశాడని చెబుతున్నారు. మరి ఈ నెగెటివ్ క్లైమాక్స్ ను ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారో చూడాలి.
ప్రేమ పాజిటివ్ గా ఉండాలి… వికృత రూపంలో కాదు : హరీష్ రావు