telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ క్రొత్త మూవీ…?

RAVITEJA actor

మాస్ మహారాజా రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న సినిమా ‘క్రాక్’.. హీరోగా రవితేజ 66వ సినిమా ఇది. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. రవితేజ పోలీస్ గెటప్‌లో సరికొత్తగా కనిపిస్తున్నాడు. మే 8న ప్రపంచ వ్యాప్తంగా ‘క్రాక్’ చిత్రాన్ని భారీగా విడుదల చేయనున్నారు. తదుపరి సినిమాను ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా 1980 కాలం నాటి నేపథ్యంలో కొనసాగుతుందనేది తాజా సమాచారం. కామెడీ ఎంటర్టైనర్ అయినప్పటికీ, బలమైన ఎమోషన్స్ వుంటాయని అంటున్నారు. ఇంతకుముందు త్రినాథరావు ‘సినిమా చూపిస్తమావ’ .. ‘నేను లోకల్’ సినిమాలను హిట్ చేశాడు. అదే తరహాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రవితేజ సినిమా ఉంటుందని అంటున్నారు.

Related posts