telugu navyamedia
సినిమా వార్తలు

ఆసక్తిని రేకెత్తిస్తున్న “దేవి-2” టీజర్

Devi-2

గత కొంతకాలం క్రితం ప్రభుదేవా, తమన్నా ప్రధాన పాత్రల్లో విజయ్ దర్శకత్వంలో “దేవి” సినిమా తెరకెక్కింది. హార్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగులో “అభినేత్రి” పేరుతో విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లతో మంచి హిట్ ను అందుకుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా “దేవి-2” సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్లో ప్రభుదేవా, తమన్నా, నందితాశ్వేత, కోవై సరళలపై కొన్ని సన్నివేశాలను చూపించారు. సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏప్రిల్ 12న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కాగా ఏప్రిల్ 19న లారెన్స్ “కాంచన-3” ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభుదేవా, లారెన్స్ కొరియోగ్రఫర్స్ గా, దర్శకులుగా, నటులుగా తమ ప్రతిభను నిరూపించుకున్నవారే. అలాంటి ఈ ఇద్దరూ హార్రర్ కాన్సెప్ట్స్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Related posts