telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ లైఫ్ టైమ్‌లో ఇది నేను చేయలేను… ‘’స్ట్రీట్ 3 డ్యాన్సర్’పై విజయ్ దేవరకొండ కామెంట్

బాలీవుడ్ మూవీ ‘స్ట్రీట్ 3 డ్యాన్సర్’ మూవీ తెలుగు ట్రైలర్‌ను యంగ్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. డ్యాన్స్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ ట్రైలర్‌లో డ్యాన్స్ చూసిన విజయ్ దేవర కొండ సినిమా చూసి ఎంజాయ్ చేయడమే తప్పా.. ఈ లైఫ్ టైమ్‌లో ఇది నేను చేయలేనని పేర్కొన్నారు. ఈ మూవీలో హీరోగా నటించిన బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌‌తో పాటు చిత్ర యూనిట్‌కు ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇదే మూవీలో శ్రద్ధా కపూర్‌తో పాటు ప్రభుదేవా కీలక పాత్రల్లో నటించారు. టి. సిరీస్, రెమో డిసౌజా ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై భూషణ్ కుమార్, దివ్య కోస్లా కుమార్, కృష్ణన్ కుమారులు ఈ మూవీని నిర్మిస్తున్నారు. సచిన్-జిగార్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 24న ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Related posts