telugu navyamedia
సినిమా వార్తలు

సోనూ సూద్ ఇజ్ ద గ్రేట్‌..!

రియ‌ల్ సూప‌ర్ మెన్ …ఈయ‌న అంద‌రికీ సుప‌రచితుడే..ఎక్క‌డ విన్నాఈయ‌న
పేరే మారుమ్రోగుతుంది. ఆయ‌న మ‌రేవ‌రో కాదు మ‌న సోనూసూద్ గారు..
క‌రోనా క‌ష్ట‌కాలంలో ఉన్న‌ అంద‌రినీ అదుకొని త‌న మంచి మ‌నుసుని
చాటుకున్నారు.

అయితే కొత్తగా మ‌రో అవ‌తారం ఎత్తారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఉన్న చిరు వ్యాపారుల‌
ఇబ్బందులు చూడ‌లేక బంజారాహీల్స్‌లో రోడ్ నెం 3లో రోడ్డు ప్ర‌క్క‌న ఉన్న చిన్న
జూస్ బండి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి స్వ‌యంగా బ‌త్తాయి జూస్ త‌యారు చేసి అంద‌రినీ
ఆక‌ట్టుకున్నారు. అలాగే బ‌త్తాయి జూస్‌లో విటిమిన్ సి ఉంటుంద‌ని దీన్నిఎక్కువ‌గా
తీసుకుంటూ స‌పోర్ట్‌ చేయాల‌ని కొరారు.

అక్క‌డే కొంత‌స‌మ‌యం గ‌డిపి, ఆ త‌రువాత చిరు వ్యాపారులు క‌రోనా స‌మ‌యంలో
చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, వారిని అంద‌రూ స‌పోర్ట్ చేయాల‌ని కోరారు.
సోనూసూద్ ఎలాంటి ప‌ని చేసినా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంద‌నే చెప్పోచ్చు..!

Related posts