ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ చిత్రం “రాజుగారిగది” చిన్న చిత్రంగా తెరకెక్కి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తరువాత ఈ సినిమాకు సీక్వెల్ గా “రాజుగారి గది-2” చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాగార్జున, సమంత కీలకపాత్రల్లో నటించారు. అయితే “రాజుగారిగది” ఆకట్టుకున్నంతగా “రాజుగారి గది-2” ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో భాగం “రాజుగారిగది 3”. అశ్విన్‌బాబు, అవికాగోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేస్తున్నారు. ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సినిమా నిర్మితమైంది. షబీర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ముందుగా ఈ సినిమాలో తమన్నాని కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. సినిమా లాంచింగ్ కార్యక్రమంలోను పాల్గొన్న ఈ అమ్మడు ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని వార్తలు వచ్చాయి. అయితే తమన్నా ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడానికి గల కారణాన్ని అశ్విన్ బాబు ప్రమోషన్ కార్యక్రమంలో తెలియజేశాడు. డేట్స్ అడ్జెస్ట్ కాని కారణంగా తమన్నా రాజుగారి గది3 నుండి తప్పుకున్నారు. రెండు షెడ్యూల్స్ లేట్ కావడం, అక్టోబర్ విడుదల పెట్టుకోవడంతో ఇంకా తమన్నా కోసం వేచి చూస్తే బాగోదని ఆమె స్ధానంలో అవికా గోర్‌ని తీసుకున్నాం. ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్ అయింది. అవికా గోర్ ఎక్స్‌ట్రార్డినరీగా చేసింది. చాలా రోజుల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. కచ్చితంగా అలరిస్తుంది ఆమె కారెక్టర్’’ అని అశ్విన్ తెలిపాడు. అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న ఈసినిమాలో ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, హరితేజ, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
previous post