telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజ్యసభ సీటుతో వెళ్లాల్సిన అవసరం అన్నయ్యకు లేదు : నాగబాబు

Nagababu

‘ప్రజారాజ్యం’ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఘోరంగా ఓడిపోయారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత తమ్ముడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ తమ్ముడికి సపోర్ట్ చేయడానికి అన్న నాగబాబు కూడా ముందుకొచ్చారు. అన్నయ్య చిరంజీవికి రాజ్య సభ సీటు ఇవ్వబోతున్నారంటూ కొన్ని వెబ్‌సైట్స్ రాస్తున్నాయి. అందులో ఏమాత్రం నిజంలేదు. ఆయన తన సినిమా కెరీర్‌పై ఫోకస్ చేస్తూ కెరీర్ పరంగా చాలా క్లియర్‌గా ఉన్నారు. నిజంగా అన్నయ్య ఏ పార్టీలోకైనా వెళ్లాలనుకుంటే ఆ పార్టీ నుంచి ఘన స్వాగతం లభిస్తుంది. రాజ్యసభ సీటుతో వెళ్లాల్సిన అవసరం అన్నయ్యకు లేదు అనేది నా అభిప్రాయం. ఆయన ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయడంలేదు. కాకపోతే తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు కాబట్టి, తమ్ముడి కోసం ఆ పార్టీకి మద్దతు పలుకుతారు. కళ్యాణ్ బాబుకు ఉన్న డెడికేషన్ చూసి తనకన్నా కళ్యాణే బాగా చేయగలుగుతాడు అని అన్నయ్య అనుకున్నారు. అలా అన్నయ్య పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అన్నయ్య కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. చెప్పాలంటే అందరి కన్నా వేగంగా ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న మహానటుడు మా అన్నయ్యే. రాజధాని విషయంలో ఆయన ఇంటి ముందు ధర్నాలకు పాల్పడుతున్నారు. అలాంటి పనులు చేయకండి. ఎందుకంటే రాజధాని విషయంలో నేను, పవన్ అమరావతికే సంపూర్ణ మద్దతు ఇచ్చాం. మేం వ్యతిరేకించలేదు. అయినప్పటికీ మీరు అన్నయ్య ఇంటి ముందు ధర్నాకు ఎందుకు దిగారో నాకైతే అర్థంకావడంలేదు. దయచేసి నిశ్శబ్దంగా సినిమాలు చేసుకుంటున్న అన్నయ్యను రాజకీయాల్లోకి లాగొద్దు. ఆయనతో రాజకీయం చేయాలని వెధవ తెలివితేటలు ప్రదర్శి్స్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Related posts