telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : శ్రీముఖి, శివజ్యోతి మధ్య వార్

starmaa official on bigg boss 3 telugu

బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం స‌క్సెస్‌ఫుల్‌గా తొమ్మిది వారాలు పూర్తి చేసుకొని ప‌దో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. గ‌త వారం హిమ‌జ ఎలిమినేట్ కాగా రాహుల్‌, మ‌హేష్ సేవ్ అయ్యారు. అయితే శనివారం రోజు నాగార్జున ప్రేక్ష‌కుల‌కి పెద్ద షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. డ‌బుల్ ఎలిమినేషన్ అంటూ ముందుగా రాహుల్‌ని ఎలిమినేట్ చేశారు. స్టేజ్ పైకి వ‌చ్చాక ఇది ఫేక్ ఎలిమినేష‌న్ అంటూ రాహుల్‌ని సప‌రేట్ గ‌దిలో ఉంచారు. ఇంటి స‌భ్యుల‌ మాట‌లు, ఆట‌లు, పాట‌లు అన్నీ చూసుకుంటూ ప్ర‌త్యేక రూంలో ఒక రోజు అలానే ఉన్నాడు రాహుల్‌. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో పున‌ర్న‌వి, వితికా, వ‌రుణ్ సందేశ్ కోర్ట్ యార్డ్‌లో కూర్చొని రాహుల్ గురించి చ‌ర్చించుకుంటుండ‌గా ఒక్క‌సారి రాహుల్ గొంతు వినిపించింది. దీంతో అంద‌రు షాక్ అయ్యారు. షాక్ నుండి తేరుకునే లోపే రాహుల్ ఇంట్లోకి కూడా అడుగుపెట్టాడు. దీంతో పున‌ర్న‌వి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. సీక్రెట్‌గా ఇంట్లో అంద‌రిని పరిశీలించిన రాహుల్.. బాబా భాస్క‌ర్ మాస్క్ తీయ‌లేద‌ని చెప్పి బాంబ్‌ పేల్చాడు.

ఎపిసోడ్ 65లో నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌రిగింది. హౌస్‌లో ఉన్న 9 మంది కంటెస్టెంట్స్‌ని నాలుగు జంటలుగా విడగొట్టి మీలో ఎవరో గొప్పో తేల్చుకోవాలని ఫిటింగ్ పెట్టారు బిగ్ బాస్. ఈ నామినేషన్స్‌కి హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న మహేష్ విట్టాకు మినహాయింపు ఇచ్చారు. టాస్క్‌లో మూడు ప్ర‌శ్న‌ల‌కి ఇద్ద‌రు స‌మాధానం ఇవ్వాల్సి ఉండ‌గా మొద‌టి ప్ర‌శ్న ప్ర‌త్య‌ర్ధి క‌న్నా మీరు ఫినాలే వ‌ర‌కు వెళ్లడానికి మీరు ఎందుకు అర్హులు. రెండోది బిగ్ బాస్ షోలో నీకంటే నా ప్ర‌ద‌ర్శ‌న ఎందుకు బాగుంది. మూడోది ఈ ఇంట్లో ఉండ‌డానికి నీ క‌న్నా అర్హ‌త నాకేముంది అనే విష‌యాల‌పై చ‌ర్చించాలి. ఇంటి స‌భ్యులు ఎవ‌రి ప్ర‌ద‌ర్శ‌న బాగుంటే వారికి ఓటేయాల్సి ఉంటుంది. కెప్టెన్ కూడా ఇందులో పాల్గొన‌వ‌చ్చు. గెలిచిన‌వారు ఓడిన వారి మెడ‌లో మిర్చి దండ వేయాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ ఆదేశించారు. మొద‌టి జంట‌గా శ్రీముఖి, శివ‌జ్యోతి హాట్ సీట్‌లో కూర్చోగా వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ పీక్ స్టేజ్‌కి చేరుకుంది. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర దూష‌ణ‌లు చేసుకుంటూ టాస్క్‌ని ర‌క్తి క‌ట్టించారు. శివ‌జ్యోతి, శ్రీముఖి మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ మ‌రే ఇద్ద‌రి మ‌ధ్య జ‌ర‌గ‌క‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం. అయితే శివ‌జ్యోతి, శ్రీముఖిల‌లో ఇంటి స‌భ్యులు శివ‌జ్యోతిని సేవ్ చేసి శ్రీముఖిని నామినేట్ చేశారు.

అనంతరం వితికా షెరు, రవిక్రిష్ణల మధ్య నామినేషన్స్ వార్ జ‌ర‌గ‌గా వితికాకే ఎక్కువ ఓట్లు రావడంతో ఆమె నామినేషన్స్ నుండి సేవ్ అయ్యి రవి నామినేషన్‌లోకి వెళ్లాడు. మూడో జోడీగా రాహుల్, వరుణ్‌ల మధ్య నామినేషన్స్ వార్ జరగ్గా ఈ వార్‌లో ప‌సే లేకుండా పోయింది. ప్రత్య‌ర్థిగా ఉన్న వ‌రుణ్ కూడా రాహుల్ గురించి పాజిటివ్‌గా మాట్లాడ‌డంతో రాహుల్ సేవ్ అయ్యి వ‌రుణ్ సందేవ్ ఎలిమినేష‌న్ జోన్‌లో ఉన్నాడు. ఇక నాలుగో జోడీగా పునర్నవి, బాబా భాస్కర్‌ల మధ్య వార్ జరగ్గా.. ఇందులో పునర్నవిని సేవ్ చేసి బాబాని నామినేష‌న్‌లోకి పంపారు. మొత్తానికి ప‌దో వారంలో శ్రీముఖి, రవి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్‌ల‌లో ఒకరు ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ల‌నున్నారు.

Related posts