telugu navyamedia
సినిమా వార్తలు

సూపర్‌స్టార్ “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28” స్పెషల్ వీడియో..

ఈ రోజు సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఎప్పుడ‌ప్పుడా అని ఎదురు చూస్తున్న‌ సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అంటూ “సర్కారు వారి పాట” నుంచి రిలీజైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

మహేశ్‌ బర్త్‌డేని పురస్కరించుకుని ఆగస్టు 9న ‘సూపర్‌స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌’ పేరుతో ఈ వీడియో విడుదల చేశారు. మునుపెన్నడూ లేనివిధంగా ఇందులో మహేశ్‌ మరింత యంగ్‌గా‌ కనిపించారు.

ఆయన చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు, కీర్తిసురేశ్‌తో లవ్‌ ట్రాక్‌ ఇలా ప్రతిదీ అదరహో అనేలా ఉంది. ‘ఇఫ్‌ యూ మిస్‌ ది ఇంట్రస్ట్‌ యు విల్‌ గెట్‌ ది డేట్‌’ అంటూ రౌడీలతో మహేశ్‌ చెప్పే డైలాగ్‌లు ఈలలు వేయించేలా ఉన్నాయి. ‘సార్‌ పడుకునే ముందు ప్రతి రోజూ దిష్టి తీయడం మాత్రం మర్చిపోకండి’ అంటూ మహేశ్‌ అందం గురించి కీర్తి చెప్పే డైలాగ్‌, ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌.. వావ్‌ అనిపిస్తున్నాయి.

ఆ టీజర్ నెట్టింట్లో ట్రెండ్ అవుతుండగానే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28” మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను ఆవిష్కరించి సర్ప్‌రైజ్ చేశారు. . వీడియో విజువల్స్ “అతడు” సినిమా నుండి వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది.

మహేష్ ఇంత‌కుముందు తీసిన‌ చిత్రాల నుండి తీసిన యాక్షన్, ఎమోషనల్ క్లిప్పింగ్స్ అన్నీ ఒకే దగ్గర చేర్చి ఈ వీడియో తయారు చేశారు. వీడియోలో మహేష్ నిజ జీవితంలో మానవతావాదం కూడా హైలైట్ చేశారు.

వికలాంగులతో ఆయన ఉన్న క్లిప్పింగ్‌లు, అవసరమైన పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేయడంలో సహాయపడటం కూడా వీడియోలో చూపించారు. చివరికి “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28″పై ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు ప్రత్యేక ప్రకటన రానుందని ప్రకటించారు. ఈ వీడియోను మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘సర్కారువారి పాట’ విడుదల కానుంది. ఈ రోజు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు “బ్లాస్టర్” ట్రీట్స్‌ తో ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Related posts