*సోనియా గాంధీకి కరోనా సోకింది..
*ఐసోలేషన్‌లో సోనియా, పలువురు కాంగ్రెస్ నేతలు..
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ వచ్చింది. గురువారం స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆమెకు వైద్యులు నిర్వహించగా టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె ఐసోలేషన్‌లోకి వెళ్ళారని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా వెల్లడించారు.
ఇటీవల సోనియాతో సమావేశమైన కాంగ్రెస్ నేతలకు కరోనా సోకినట్టు తెలుస్తోంది. దీంతో పలువురు నేతలంతా ఐసోలేషన్‌లో ఉన్నారు.
కాగా..నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణ కోసం జూన్ 8న సోనియాను హాజరుకావాలని ఈడీ నోటీసులో సూచించిన సంగతి తెలిసిందే.
అయితే రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు. అంతేకాదు, ఈడీ ముందు హాజరు కావడానికి మరికొంత సమయం కావాలని రాహుల్ గాంధీ కోరినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.