telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గ‌త ఏడాది నుంచి పార్టీలో స‌రైన గుర్తింపు లేదు..బుధ్ధి లేనివాళ్లు బుద్ధి లేని మాట్లాడుతున్నారు..

*టీడీపీ దివ్య‌వాణి రాజీనామా
*తీవ్ర భావోద్వేగానికి గురై.. కన్నీళ్లు పెట్టుకున్న దివ్యవాణి
*బుధ్ధి లేనివాళ్లు బుద్ధి లేని మాట్లాడుతున్నారు..
*ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తార‌నే చంద్ర‌బాబు పార్టీలో చేరుతాను..
*చంద్ర‌బాబు మంచి విజ‌న్ ఉన్న నాయ‌కుడు..
*గ‌త ఏడాది నుంచి పార్టీలో స‌రైన గుర్తింపు లేదు..
*నేను ఎప్పుడూ ఎవ‌రికి భ‌జ‌న చేయ‌ను..

తెలుగుదేశం పార్టీకి సినీనటి దివ్యవాణి రాజీనామా చేశారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన అనంతరం దివ్యవాణి ఆమె ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ సంద‌ర్భంగా దివ్యవాణి ప్రెస్‌మీట్‌లో తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. టీడీపీలో గతేడాదిగా నాకు స‌రైన గుర్తింపు లేదని అన్నారు. ఓ నేతను ప్రశ్నించినందుకు నేతలంతా తనను దూరం పెట్టారని అన్నారు.

తనలాగా పార్టీలో ఇబ్బందులు పడేవారు చాలా మంది ఉన్నారని.. కానీ వాళ్లకు పదవులు అవసరం కాబట్టి అలా ఉంటున్నారన్నారు. గౌరవం లేనిచోట ఉండలేనని ఆమె స్పష్టం చేశారు.

మహానాడులో తన పేరు రాలేదని, అందుకే ఇప్పుడు హైలెట్ చేసుకుంటోందని కొందరు మూర్ఖులు మాట్లాడుతున్నారు. వారి మాటలు నేను పట్టించుకోను.

కొందరు బుద్ధిలేని వారు బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారు. ప్యాకేజీ అందిందని.. అందుకే రాజీనామా చేయడం లేదంటున్నారని పేర్కొన్నారు. చివరి నిమిషం వరకూ క్లారిటీ తీసుకునేందుకే ఆగానని దివ్యవాణి తెలిపారు.

దివ్యవాణి అంటే బాపు బొమ్మ అనేది మర్చిపోయి నాపై విమర్శలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో గాజు బొమ్మలాగా ఉండేదాన్ని. పెద్ద పెద్ద హీరోలతో కేవలం స్వాభిమానం చంపుకోలేక మాత్రమే నటించలేదు. అలాంటి నాపై విమర్శలు చేస్తున్నారు. పార్టీలో చేరిన కొద్ది రోజులకే ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నాను. ఒక మంచి నేత వద్ద పని చేస్తే ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందనే ఆశయంతో టీడీపీలో చేరాను. ఇలాంటి రోజు వస్తుందని భావించలేదని అన్నారు.

నేను ఎవరికీ ఎప్పుడూ భజన చేయలేదు.. చేయను. పార్టీలో ఏం జరుగుతుందో ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నా సమస్యను లోకేశ్‌ దృష్టికి తీసుకెళితే.. జనార్ధన్‌కు చెప్పమన్నారు. కొందరు ఇడియట్స్‌ జర్నలిజం పేరుతో నానా మాటలు అన్నారు. అలాంటి ఇడియట్స్ కి చెప్తున్నాను.

ఒరేయ్ ఇడియట్.. విను. దివ్యవాణి అన్ని ప్రెస్ మీట్లు ప్రార్థనతో స్టార్ట్ చేయలేదు. సమస్య క్రైస్తత్వానిది కాబట్టి, క్రీస్తు గురించి ఏం మాట్లాడినా ముందు.. అందులో వ్యర్థమైంది ఉంటే తీసేసి కావాల్సింది ప్రజలకు అందించు అని ప్రార్థనతో స్టార్ట్ చేయడం అనే పద్ధతి బైబిల్‌లో ఉంది. ఆ పద్ధతిని ఫాలో అయ్యాను.

అంతేకానీ, టీడీపీ ప్రెస్ మీట్ లో కూర్చొని నేను ప్రార్థనలు చేయలేదు. నాపైన అడ్డగోలు విమర్శలు చేస్తున్న వారికి ఇదంతా చెప్తున్నా. నిజానికి బయటికి తీసుకొచ్చేవాడే జర్నలిస్టు. అంతేకానీ, మా బాధ ఏంటో మా పరిస్థితి ఏంటో తెలీకుండా మాట్లాడేవాడు జర్నలిస్టు కాదు.’’ అని దివ్యవాణి ఫైర్ అయ్యారు.

Related posts