telugu navyamedia
తెలంగాణ వార్తలు

గాంధీభవన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు: స్టెప్పులేసిన వీహెచ్, జగ్గారెడ్డి

ప్ర‌త్యేక‌ తెలంగాణ ఏర్ప‌డి 8 ఏళ్ళు అవుతున్న సంద‌ర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగుర వేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహేశ్వర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు డ్యాన్సులు చేశారు. గాంధీ భవన్ ఎదుట గిరిజన మహిళలతో కలిసి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హ‌నుమంత‌రావు డ్యాన్సులు చేశారు. వీహెచ్ డోలు వాయిస్తూ గిరిజన మహిళలతో కలిసి డాన్స్‌ చేశారు. వీహెచ్ డ్యాన్స్ చేయడాన్ని చూసిన జగ్గారెడ్డి కూడా కొద్దిసేపు మహిళలతో కలిసి స్టెప్పులేశారు.

Related posts