telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

సాంకేతిక సమస్యలపై స్పష్టంగా చెప్పాం: రజత్‌కుమార్‌

Rjath kumar iAS

సాంకేతిక సమస్యలపై కృష్ణా, గోదావరి బోర్డులకు స్పష్టంగా చెప్పామని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ పేర్కొన్నారు. సాగునీరు, ప్రాజెక్ట్‌ల విషయంలో నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణ ఉద్యమం వచ్చిందని గుర్తుచేశారు. పాత ప్రాజెక్ట్‌లకు డీపీఆర్‌ అడగొద్దని చెప్పామని, కాళేశ్వరాన్ని కొత్త ప్రాజెక్ట్‌గా భావించొద్దని చెప్పామని పేర్కొన్నారు.

లోకేషన్‌, డిజైన్‌ మార్పు లాంటి కారణాలతో కొత్త ప్రాజెక్ట్‌గా పరిగణించొద్దని, గోదావరిలో తెలంగాణ వాటా ప్రకారమే ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నామని తెలిపారు. పట్టిసీమ నీటి విషయంలో తెలంగాణ వాటా ఇవ్వాలని కోరామని ఆయన చెప్పారు. పోలవరం నుంచి పట్టిసీమకు 80 టీఎంసీలు ఇస్తున్నారని తెలిపారు.

కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌)లను సమర్పించాల్సిందేనని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. బోర్డుతో పాటు కేంద్ర జల సంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు రావాలంటే డీపీఆర్‌లు అవసరమని పేర్కొంది.

Related posts