*చార్మీనార్ వివాదంపై బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు..
*అమ్మవారి శక్తిని గుర్తించారు కాబట్టే..ఇప్పుడు మసీదు గుర్తొచ్చింది..
*కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ ఎస్ డ్రామాలు ఆడుతున్నారు..
చార్మినార్‌లో నమాజ్ కోసం సంతకాల సేకరణపై రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ నేత రషీద్‌ఖాన్ సంతకాల సేకరణ చేపట్టడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.‘‘మేం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటేనే.. మీకు నమాజ్ గుర్తొచ్చిందా?. అంతకుముందు నమాజ్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే భాగ్యలక్ష్మి దేవాలయం మీద చేయి వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. చార్మినార్‌ను తొలగించాలని తాము ఎప్పుడూ చెప్పలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ…అమ్మవారి శక్తిని గుర్తించారు కాబట్టే..ఇప్పుడు మసీదు గుర్తొచ్చిందని తెలిపారు
కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఛార్మీనార్ దగ్గర భాగ్యలక్ష్మీ దేవాలయం లేదనేవాడు మూర్ఖుడని మండిపడ్డారు. చార్మినార్ ను తొలగించాలని తాము ఏనాడు ఆనలేదన్నారు. ఓల్డ్ సిటీ న్యూ సిటీగా ఎందుకు కాకూడదని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి యంఐయం కొమ్ముకాస్తుందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఏ రకంగా కుటుంబ పాలన ఉందన్నారు. ఎంఐఎం చీఫ్ అస తన ఆస్తులను పెంచుకోవడానికి, కాపాడుకోవడానికి ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శలు చేశారు. పాతబస్తీని ఎంఐఎం అభివృద్ది చేయడం లేదన్నారు. ఓల్డ్ సిటీ హైటెక్ సిటీగా ఎందుకు మారొద్దు, ఓల్డ్ సిటీలో ఫ్లై ఓవర్లు ఎందుకు రావొద్దని తాము ప్రశ్నించినట్టుగా బండి సంజయ్ గుర్తు చేశారు.
ఓల్డ్ సిటీ సంఘ విద్రోహశక్తులకు, ఉగ్రవాదులకు ఎందుకు అడ్డాగా మారిందో చెప్పాలన్నారు. ముస్లిం మైనార్టీ ఓట్లను పొందాలనే ప్రయత్నంలో భాగంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు