‘7జి బృందావన్ కాలనీ’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సోనీ అగర్వాల్ ప్రేక్షకులకు ఇప్పటికి గుర్తిండిపోయింది. ఆ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.
తాజాగా సోనీ అగర్వాల్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డిటెక్టివ్ సత్యభామ’. సిన్మా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నవనీత్ చారి దర్శకత్వంలో శ్రీశైలం పోలెమోని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్, పోస్టర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో విడుదల చేశారు.
ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ … ట్రైలర్ చూస్తుంటే ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాల ఘటనలను బేస్‌గా తీసుకుని ఈ సినిమా చేసినట్లు ఉంది. వాస్తవాలతో కూడిన కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సోనీ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్‌ని ప్రధాన పాత్రకు ఎంచుకోవటంలోనే సగం సక్సెస్ సాధించారు. అన్నారు.
భాషాశ్రీ మాట్లాడుతూ .. దర్శకుడు నాకు చాలా కాలంగా మిత్రుడు దాదాపు 400 సినిమాలకు వివిధ డిపార్ట్‌మెంట్స్‌లో పనిచేశాడు. ఆ అనుభవంతో మెగాఫోన్ పట్టుకున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు.
నిర్మాత శ్రీశైలం పోలెమోని మాట్లాడుతూ .. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ అన్న బేధం లేకుండా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి పోయాం. ఒక ఇంట్లో శుభకార్యాన్ని అందరూ కలిసి ఎలా విజయవంతం చేస్తారో.. మేమందరం అలాగే ఈ సినిమాని విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు.