telugu navyamedia
క్రీడలు వార్తలు

హార్దిక్ ను తీసుకోకపోవడం పై క్లారిటీ ఇచ్చిన భారత బౌలింగ్ కోచ్

Hardik

టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాట్లాడుతూ… బౌలింగ్ చేయలేకపోవడం వల్లే బెస్ట్ ఆల్‌రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టామని స్పష్టం చేశాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేకపోతున్నాడని, దాంతో ప్రత్యామ్నాయ ఆల్‌రౌండర్‌పై దృష్టిసారించమన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో శార్దూల్ ఠాకుర్ సత్తా చాటడంతో అతనికి అవకాశం దక్కిందన్నాడు. ‘హార్దిక్ పాండ్యా​కు మించిన ఆటగాడిని వెతికి పట్టుకోవడం చాలా కష్టం. అతనిలో అసాధారణమైన ప్రతిభ ఉంది. కానీ దురదృష్టవశాత్తు వెన్నుముక శస్త్రచికిత్స వల్ల బౌలింగ్​ చేయలేకపోతున్నాడు. 2018లో అతను చివరిసారిగా ఇంగ్లండ్​పై ఆడిన టెస్టు క్రికెట్​లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఏదేమైనప్పటికీ అతనిపై ఒత్తిడి తగ్గించి తిరిగి కోలుకునేలా చేయాలి. అతనికి ప్రత్యామ్నయంగా ఆల్​రౌండర్లను సెలక్టర్లు గుర్తించడం పెద్దపని. ఆ తర్వాత వారిని మేం మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం. శార్దూల్​ విషయానికొస్తే అతడు మంచి ఆల్​రౌండర్​ అని నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేశాడు. బౌలింగ్​ ఆల్​రౌండర్​గా ఎదగాలని పట్టుదలతో ఉన్నట్లు అంతకుముందు చెప్పాడు.

Related posts