telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇసుక పంపిణీలో అవినీతిని నిర్మూలించాం: సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇసుక తవ్వకాలు, పంపిణీపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇసుక తవ్వకాలు, పంపిణీలో అవినీతిని నిర్మూలించామని నేడు గర్వంగా చెప్పగలమని ఉద్ఘాటించారు. ఇసుక విషయంలో టీడీపీ అనవసర ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఒక్క ఇసుక లారీ కూడా వెళ్లకూడదని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల వద్ద గట్టి పహరా వ్యవస్థ ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. వరదలు తగ్గేలోగా వాగులు, వంకల్లో సుమారు 70 రీచ్ లు గుర్తించాలని తెలిపారు. 267 రీచ్ లు ఉంటే వరదల వల్ల 69 చోట్లకు మించి ఇసుక తీయలేకపోతున్నామని పేర్కొన్నారు.అక్రమాలు జరిగితే అడ్డుకోవాలని కలెక్టర్లకు, ఎస్పీలకు ఎప్పుడో చెప్పానని వెల్లడించారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంతగా వర్షాలు, వరదలు వస్తున్నాయని తెలిపారు. వరదల కారణంగా ఆశించిన రీతిలో ఇసుకను తీయలేకపోతున్నామని జగన్ వివరణ ఇచ్చారు.

Related posts