సెప్టెంబర్ 17న ఎవరిపైనా ఎలాంటి ఆంక్షలు లేవని తెలంగాణ సీఎం తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లోజరిగిన చర్చలపై సీఎం సమాధానమిస్తూ . 17 సెప్టెంబర్ రోజు ప్రతి సంవత్సరం తెలంగాణ భవన్‌పైన జాతీయ జెండా ఎగరవేస్తునే ఉన్నాం, ఎగురవేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆ రోజు ఎవరిపైనా ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. ఎవరు ఎం చేయదల్చుకుంటే అది చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆ రోజు రాజరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు పయనించిన రోజు కాబట్టి అందరూ జెండా ఎగరవేయవచ్చని చెప్పారు. దీనికిపై కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా మతం స్వీకరించిన వాడికి నామాలెక్కువ అని ఎద్దెవా చేశారు.
నిజాంకు రాజ్‌ప్రముఖ్ బిరుదు ఇచ్చి గవర్నర్‌ను చేసింది అప్పటి హోం మినిస్టర్ వల్లబాయ్‌పటేల్ కదా అని గుర్తు చేశారు. జనరల్ జేఎన్‌చౌదరి ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల పాటు కౄరాతి క్రూరమైన మిలటరీ పరిపాలన తెలంగాణలో కొనసాగిందని అన్నారు. వేదనకు గురైన తెలంగాణ గురించి పట్టించుకోకుండా లెఫ్టిస్టులు, రైటిస్టులు రాజకీయం చేయాలని చూశారు తప్ప ప్రజల బాధలు ఏనాడు పట్టించుకోలేదన్నారు.