ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రమశిక్షణ తప్పిన నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మున్సిపల్ అధికారులపై క్రికెట్ బ్యాటుతో బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ కుమారుడే ఆకాశ్ చేసిన దాడి ఘటనపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు.
ఈరోజు జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ పేరును దెబ్బతీసే ఇలాంటి నేతలు తమకు వద్దని అన్నారు. ఇలాంటి చర్యలు మంచివి కాదని చెప్పారు. ఎవరి కొడుకైనా, ఎవరి బంధువైనా సరే వారిని పార్టీ నుంచి తొలగించాలని అన్నారు. ఇలాంటి వారికి మద్దతిచ్చే వారిని కూడా తొలగించాలని సూచించారు.
చంద్రబాబుకు భద్రత తగ్గించామనడం సరికాదు: డీజీపీ గౌతమ్ సవాంగ్