telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు న‌మోదు..

దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు రోజురోజుకు విజృంభిస్తూనే ఉంది. తాజాగా ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇప్ప‌టికే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు న‌మోదు కాగా.. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నమోదైంది.

కెన్యా నుంచి వచ్చిన మహిళకు పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ తేలింది. దీంతో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు అధికారులు. ఈ పరీక్షల్లో ఆ మహిళకు కరోనా ఒమిక్రాన్ సోకిందని తేలింది. అయితే.. ఆ మ‌హిళ కుటుంబ స‌భ్యుకు మాత్రం నెగిటివ్ వ‌చ్చింది.

omicron: Two new Omicron cases from Andhra Pradesh, Punjab take India's  tally to 35 - The Economic Times Video | ET Now

కాగా..భారత్‌లో ఇప్పటివరకు 214 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. 15 రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో స‌గానికి పైగా మ‌హారాష్ట్ర, ఢిల్లీలోనే వెలుగుచూశాయ‌ని అధికారిక గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి.

రాష్ట్రాల్లో న‌మోదైన వేరియంట్ కేసులు ..

ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 54, తెలంగాణలో 24, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో 2, ఒడిశాలో 2, ఉత్త‌ర‌ప్ర‌దేశ్,ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 2, ఛండీగఢ్‌, లద్దాఖ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోద‌య్యాయి.

Related posts