telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రామతీర్థం బోడి కొండపై మ‌ళ్ళీ ఉద్రిక్తత

విజయనగరం జిల్లాలో రామతీర్థంలోని బోడికొండపై మ‌ళ్ళీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోదండ రామాలయం పునర్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. దాదాపు .3కోట్ల వ్యయంతో నిర్మించనున్న శ్రీ కోదండ రామాలయ పునఃనిర్మాణానికి బుధవారం దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ శంకుస్థాపన చేశారు.

ఆలయ పునర్మిరాణ శంకుస్థాపనను ధర్మకర్తల మండలితో చర్చించకపోవడంపై ఆలయ ధర్మకర్త, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‌గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనవాయితీ ఫాలో అవ్వడంలేదని, సంప్రదాయాలను పక్కనపెట్టారని, జరగాల్సిన మర్యాదలు లేవని ఆశోక్‌గజపతి ఆగ్రహించారు. అక్కడున్న శిలా ఫలకం బోర్డు ను పీకేసే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలోనే అధికారులుకు , అశోక్‌గజపతిరాజుకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అశోక్ గజపతిరాజును కొబ్బరి కాయ కొట్ట నివ్వకుండా పక్కకు నెట్టుకుంటూ వెళ్లారు ఆక్కడి కొందరు వ్యక్తులు. దీంతోరెండు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఈ ఉద్రిక్తత మధ్యే రామతీర్థంలో ఆలయానికి శంకుస్థాపన పూర్తిచేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణితోపాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దేవస్థాన అధికారులు హాజరయ్యారు.

ఆలయంలో స్వామివారి విగ్రహాం ధ్వంసం జరిగి ఏడాది అవుతున్నా ఇంత వరకు నిందితులను పట్టుకోలేదని… ఏడాదిలో గుడి కట్టి తీరుతం అని చెప్పి ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా జరగక పోవడం దారుణమ‌ని ఫైర్ అయ్యారు. ఆధారాలును తారుమారు చేయడానికి ఇంత లేట్ చేసారని.. ఆలయం ధర్మ కర్త కు కనీసం మర్యాద ఇవ్వడం లేదని ఆగ్ర‌హించారు. గుడికి విరాళం ఇస్తే నా మొహంపై విసిరి కొట్టారని… భక్తులు విరాళాలు తిరస్కరించడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు. ఈ ప్రభుత్వం హయాంలో వందలాది ఆలయాలు ధ్వంసం జరిగాయని అశోక్ గజపతి రాజు  ఫైర్ అయ్యారు.

Related posts