telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్ ఇంటర్వ్యూలో మూడో భాగం విడుదల

pawan

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ సోషల్ మీడియా విభాగం కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూను అనేక భాగాలుగా విడుదల చేస్తున్నారు. తాజాగా ఇవాళ మూడో భాగం విడుదల చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తన తండ్రి అస్థికలు త్రివేణి సంగమంలో కలిపేందుకు వెళ్లినప్పుడే ముంబయిలో తాజ్ హోటల్ పై ఉగ్రదాడి జరిగిందని వెల్లడించారు. ఆ ఆపరేషన్ దాదాపు మూడ్రోజుల పాటు సాగిందని తెలిపారు. అంతకుముందు మరో సంఘటనలో పార్లమెంటు భవనంపైనే ఉగ్రదాడి జరిగిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో తనకు అనేక సందేహాలు వచ్చాయని అన్నారు. దేవాలయం వంటి పార్లమెంటు మీద దాడి జరగడం ఏంటి? అసలు ఉగ్రవాదులు అక్కడి వరకు ఎలా వచ్చారు? అన్న ఆలోచనలు రేగినప్పుడు నరేంద్ర మోదీ కనిపించారు. ఆయన లాంటి బలమైన నేత అవసరం కనిపించింది. 2014లో మోదీ నాయకత్వానికి ఆమోదం లభించడం కూడా ఈ కారణం వల్లనే. కొన్ని నిర్ణయాలు అందరికీ నచ్చకపోవచ్చు. దీర్ఘకాలంలో ఆ నిర్ణయాలే సరైనవి అనిపిస్తాయి. 2014 నుంచి నేను అదే ఆలోచనా విధానం పాటిస్తున్నానని అన్నారు.

Related posts