టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కు లేఖ రాశారు.ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో కోరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గతేడాది ఫిబ్రవరి 21న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఐతే ఇప్పటివరకు ఆమోదించకపోవడంతో ఆయన స్పీకర్ కు లేఖ రాశారు. ఇప్పటి వరకు రాజీనామా ఆమోదించి కపోవడం సరైంది కాదనీ.. నా రాజీనామా ఉద్యమానికి బలం చేకూరుతుందని తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో కోరారు.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని నా రాజీనామా కార్మిక సోదరులకు ఉపయోగపడుతుందని గంటా పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలని కూడా ఆయన కోరారు.
నాకు సామాజిక హోదా గుర్తింపు , రాజకీయ జీవితాన్ని ఇచ్చిన విశాఖ నా పదవి త్యాగం చాలా చిన్నదని అంతకుమించి ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడ్డ నా ఆవేదనను సానుకూలంగా అర్ధం చేసుకుని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కై నేను నా పదవికి చేసిన నా రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో కోరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఎసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో గంటా శ్రీనివాసరావు తన రాజీనామా లేఖను మీడియా ప్రతినిధులకు అందించారు.
సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఏపీ ప్రజలంతా ఔటే: కేఏ పాల్