telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రివర్స్ టెండరింగ్ పేరుతో జిమ్మిక్కులు.. జగన్ ప్రభుత్వం పై సుజనా ఫైర్

sujana chowdary at CBI inquiry

ప్రాజెక్టుల విషయంలో ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న చర్యల కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో జిమ్మిక్కులు చేస్తోందని మండిపడ్డారు.
ఏపీ, తెలంగాణకు వరద వస్తుందని కర్ణాటక ప్రభుత్వం ముందే సమాచారం ఇచ్చిందని తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోలేకపోయిందిని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వానికి వరదల నియంత్రణ, సహాయక చర్యలు చేపట్టడం ఎలాగో తెలియడం లేదని దుయ్యబట్టారు. టీడీపీ, వైసీపీలు వరద బాధితులను పట్టించుకోకుండా రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధన కారణంగా ఏపీకి పరిశ్రమలు రావని అభిప్రాయపడ్డారు. ప్రపంచమంతా ఆర్థికమాంద్యంపై భయపడుతున్న తరుణంలో జగన్ చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఇసుక పాలసీ నిలిపివేయడంతో ఉపాధి హామీ పనులుఆగిపోయాయని అన్నారు. 

Related posts