telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిన్ని అభిమానితో సల్మాన్ ప్రవర్తించిన తీరుకు నెటిజన్స్ ఫిదా

Salman

స‌ల్మాన్‌ఖాన్, ప్ర‌భుదేవా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం “దబాంగ్-3”. స‌ల్మాన్ ఖాన్‌, అర్బాజ్‌ఖాన్‌, నిఖిల్ ద్వివేది ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబ‌ర్ 20న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఇటీవలే విడుదల చేశారు. తొలి రెండు పార్టుల్లో స‌ల్మాన్ స‌ర‌స‌న న‌టించిన సోనాక్షి సిన్హానే ఈ చిత్రంలోనూ స‌ల్మాన్ భార్య‌గా న‌టించారు. అయితే స‌ల్మాన్ ఫ్లాష్ బ్యాక్‌లో మాత్రం ఓ ల‌వ్‌స్టోరీ ఉన్న‌ట్లు ట్రైల‌ర్ చూపించారు. ఈ ట్రైల‌ర్‌లో మ‌హేశ్ మంజ్రేక‌ర్ త‌న‌య స‌యీ మంజ్రేక‌ర్ ప్రేయ‌సిగా న‌టించింది. తొలి రెండు భాగాల్లో స‌ల్మాన్ తండ్రిగా న‌టించిన వినోద్ ఖ‌న్నా క‌న్నుమూయ‌డంతో ఆయ‌న స్థానంలో ప్ర‌మోద్ ఖ‌న్నా న‌టించారు. డింపుల్ క‌పాడియా స‌ల్మాన్ త‌ల్లిగా న‌టించారు. ద‌బంగ్‌లో సోనూసూద్‌, దబాంగ్-2లో ప్రకాశ్ రాజ్ విల‌న్స్‌గా న‌టించ‌గా దబాంగ్-3లో క‌న్న‌డ స్టార కిచ్చా సుదీప్ విల‌న్‌గా న‌టించారు. ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే ఈ చిత్రంతో తొలిసారి స‌ల్మాన్ ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌ను కూడా ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఇందులో చుల్‌బుల్ పాండే అనే పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌తో అల‌రించ‌నున్నాడు. రీసెంట్‌గా చిత్ర ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం ముంబైలో జ‌ర‌గ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి సోనాక్షి సిన్హా, సాయి మంజ్రేక‌ర్‌తో పాటు చిత్ర బృందం హాజ‌రయ్యారు. దబాంగ్ 3 చిత్ర ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అయితే రీసెంట్‌గా ర‌మేష్ త‌రుణి ఇంట్లో జ‌రుగుతున్న దీపావ‌ళి పార్టీ వేడుక‌కి స‌ల్మాన్ హాజ‌రు కాగా, ఆయ‌నని ఫోటో గ్రాఫ‌ర్స్ త‌మ కెమెరాల‌లో బంధించారు. ఈ క్ర‌మంలో ప‌లు ఫోజులు కూడా ఇచ్చారు స‌ల్మాన్. అయితే ప‌క్క‌నే ఉన్న ఓ ఫ్యాన్ స‌ల్మాన్‌తో సెల్ఫీ దిగేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నించింది. ఈ విష‌యం తెలుసుకున్న స‌ల్మాన్ త‌న అభిమానిని పిలిచి మరీ సెల్ఫీ దిగాడు. ఆమెకి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాడు. అతను ప్ర‌వ‌ర్తించిన తీరుకు నెటిజన్స్ ఫిదా అయ్యారు.

 

View this post on Instagram

 

#SalmanKhan obliges a fan selfie as he arrives for #rameshtaurani Diwali party today #Instalove #ManavManglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

Related posts