6న ఏపీలోని మూడు జిల్లాలోని 5 పోలింగ్ కేంద్రాలపరిధిలో రిపోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా ఎన్నికల ఇవాళ సాయంత్రం ఆరు గంటలతో ప్రచారం ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది మీడియాతో మాట్లాడారు. రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ సూపరిన్టెండెంట్ పోలీస్ అధికారి, ప్రత్యేక కేంద్ర పరిశీలికుల ఆధ్వర్యంలో అత్యంత పకడ్బందీగా రిపోలింగ్ ఎన్నికలను నిర్వహిస్తున్నామని మీడియాకు వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 50 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకూ రిపోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద లోపల, బయట కూడా వీడియో కవరేజ్ ఏర్పాటు చేయడం జరిగిందని ద్వివేది తెలిపారు.
ఇప్పటికే ఆయా పోలింగ్ బూత్ పరిధిలో ఓటర్లకు రిపోలింగ్ జరుగుతున్న విషయాన్ని ఓటర్లకు టామ్ టామ్ ద్వారా తెలియజేశాము. ఓటరు స్లిప్పులను అందజేశాము. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం ఉంటుంది. మే 23న ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ ఉదయం 8గంటలకు ప్రారంభం అవుతుంది. తొలుత పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ఈవీఎంలు లెక్కింపు ప్రక్రియను చేపట్టడం జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బందిని రాండిమానైజెషన్ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.. అని సీఈఓ ద్వివేది చెప్పుకొచ్చారు.