telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

శ్రీహరికోట నుండి పీఎస్ఎల్వీ సీ-49 ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో…

శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో… షార్ ‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఒక స్వదేశీ, 9 విదేశీ ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్వీ-సీ 49 రాకెట్‌ ను ప్రయోగించారు శాస్త్రవేత్తలు.. శుక్రవారం మధ్యాహ్నం 1.03గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ.. ఇవాళ మధ్యాహ్నం 3.03 గంటలకు ముగిసింది.. వెంటనే పీఎస్‌ఎల్వీ సీ-49 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది… అన్ని ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టిన తర్వాత… ఈ ప్రయోగం విజయవంతం అయినట్టు ప్రకటించారు ఇస్రో చైర్మన్‌ శివన్‌.. ఈ రాకెట్‌ ద్వారా మన దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-01తో పాటు అమెరికా, లక్సెంబర్గ్‌ దేశాలకు చెందిన ఉపగ్రహాలు నాలుగు చొప్పున, లిథువేనియా దేశానికి చెందిన ఒక ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టి.. అంతరీక్షంలో మరోసారి తన సత్తాఏంటో నిరూపించుకుంది ఇస్రో. అయితే ఇది నింగిలోకి దూసుకెళ్లిన సమయంలో ఆ దృశ్యాన్ని వీక్షించడానికి చాలా మంది ప్రజలు అక్కడికి వచ్చారు.

Related posts