telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మళ్ళీ .. ఎస్‌బిఐ యోనో షాపింగ్ ఫెస్టివ్‌2.0.. వచ్చేసింది..

sbi yono shopping fest from dec 10-14

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులకు షాపింగ్ ఫెస్టివల్ ను ప్రకటించింది. ఎస్‌బిఐ గతేడాది కూడా యోనో షాపింగ్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. దీని పేరు ఎస్‌బిఐ యోనో షాపింగ్ ఫెస్టివ్‌2.0గా పిలవబడుతుంది. ఈ ఆఫర్లలో భాగంగా డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్స్, ఇతర ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. ఎస్‌బీఐ డిజిటల్ ప్లాట్‌ఫామ్ యోనో యాప్‌లోనే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకుంటే ఆఫర్ల సమాచారం తెలుస్తుంది. ఆఫర్ మనకు డిసెంబర్ 10 నుండి 14 వరకు అందుబాటులో ఉంటుంది. ఎస్‌బీఐ కస్టమర్లు ఈ డేట్స్‌ను మర్చిపోకుండా సకాలంలో షాపింగ్ ఆఫర్లను పొందండి. అంతేకాక యోనో యూజర్లు ఏకంగా 50 శాతం వరకు డిస్కౌంట్ కూడా పొందొచ్చని బ్యాంక్ తెలిపింది. దాదాపు 17 మర్చంట్ పార్ట్‌నర్స్ నుంచి ఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చని పేర్కొంది. వివిధ రకాల ప్రొడక్టులపై డిస్కౌంట్ ఉంది. తగ్గింపు అనేది ప్రొడక్ట్ ప్రాతిపదికన మారుతూ ఉంటుంది.

ఎస్‌బీఐ కస్టమర్లు 50 శాతం వరకు డిస్కౌంట్‌తో పాటు అదనంగా మరో 10 శాతం క్యాష్‌బ్యాక్ కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉన్న వారికే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. మార్చంట్స్ అందించే డిస్కౌంట్‌కు ఈ తగ్గింపు అదనంగా పొందొచ్చు.ఎస్‌బీఐ యోనో ప్లాట్‌ఫామ్‌తో దాదాపు 100కు పైగా ఇమర్చంట్స్ భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. అమెజాన్, లైఫ్‌స్టైల్ స్టోర్స్, థామస్ కుక్, ఈజీమైట్రిప్, యోనో, పెప్పర్‌ప్రై, ఇతరులతోపాటు ఇతర మర్చంట్లు యోనోతో ఒప్పందం చేసుకున్నాయి. అంతేకాక డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్‌తోపాటు స్టేట్ బ్యాంక్ కస్టమరర్లు రుణాలు కూడా పొందొచ్చు. రుణాలపై వివిధ రకాల ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. జీరో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఇది వాహన రుణాలకు వర్తిస్తుంది. డిసెంబర్ 31 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.హోమ్ లోన్స్ కూడా పొందొచ్చు. ఏడాది కిందట యోనో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించామని అప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని ఎస్‌బీఐ ఎండీ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) పీకే గుప్తా తెలిపారు. వచ్చే పండుగ సీజన్, హాలిడే సీజన్ నేపథ్యంలో మళ్లీ షాపింగ్ ఫెస్టివల్ తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. దీనిద్వారా ఒకే చోటు వివిధ రకాల ఆఫర్లు సొంతం చేసుకోవచ్చని తెలిపారు.

Related posts