telugu navyamedia
రాజకీయ

భారతీయ విద్యార్థినులనుపై ఆ దేశ‌ సైనికులు వేధింపులు..

ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. అసలే ఆహారం, నీళ్లు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతుండగా..రొమేనియా, పోలాండ్ సరిహద్దుల్లోని బంకర్లలో తలదాచుకున్న కొంతమంది భారతీయ విద్యార్థినులను ఆ దేశ సైనం బలవంతంగా తీసుకెళ్లారు.

వారిపై అసభ్యంగా ప్రవర్తించినట్లు, వారిని లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు ఘటనలు వెలుగుచూస్తున్నాయి. మరికొంతమంది విద్యార్థులను కాలితో తన్నుతున్నాడు.

మరో వీడియోలో అయితే ఉక్రెయిన్ సైనికులు గాల్లోకి కాల్పులు జరిపి మన విద్యార్థులను తిరిగి ఉక్రెయిన్‌కు వెళ్లాలని బలవంతం చేస్తున్నారు. ఇద్దరు యువతులపై ఉక్రెయిన్ పోలీసులు లాఠీఛార్జీ కూడా చేశారు

దీంతో ఎటువైపు నుంచి ఏ ఆపద వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు భారతీయ విద్యార్థులు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

 

Related posts