telugu navyamedia
రాజకీయ వార్తలు

ఎన్నికలు పోటీ మాత్రమే.. యుద్ధం కాదన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

లోక్సభ ఎన్నికలు, పార్లమెంట్ నిర్వహణపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తొలిసారి స్పందించారు.
ఎన్నికలు ముగిసిపోయాయని, ఇక దేశ నిర్మాణంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

ఎన్నికలు ఏకాభిప్రాయం కోసం జరిగే ప్రక్రియ అని అన్నారు. పార్లమెంటు లో ప్రతి సమస్యకు రెండు వైపులా ఆలోచించాలని, ఒక పార్టీ ఒక వైపు ప్రస్తావిస్తే.. ప్రతిపక్ష పార్టీ మరొక కోణాన్ని ప్రస్తావించాలని అన్నారు.

ఈ ప్రక్రియ ద్వారా మాత్రమే సరైన నిర్ణయానికి చేరుకోగలమని భగవత్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు.

నాగ్‌పూర్‌ లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఈ మేరకు నూతన ప్రభుత్వం, ప్రతిపక్షాలకు ఆయన సలహాలు ఇచ్చారు.

ఏకాభిప్రాయం మన సంప్రదాయం. ఆ దిశగా పురోగతి కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియ యుద్ధం కాదు.. పోటీ మాత్రమే’’ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.

Related posts