telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వ్యాక్సిన్‌ పై రష్యా మూడో దశ ట్రయల్స్..!

corona vaccine

ప్రపంచంలో తొలిసారిగా ‘స్పుత్నిక్-వి’ పేరిట కరోనా వ్యాక్సిన్ ను రష్యా విడుదల చేసి సంచలనం సృష్టించింది. పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించకుండా ఆగమేఘాల మీద ఈ టీకాను తీసుకొచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం రెండు దశల ప్రయోగాలు మాత్రమే చేసి మార్కెట్లోకి విడుదల చేయడం సరికాదని ప్రపంచ దేశాలు ఆక్షేపించాయి. ఈ నేపథ్యంలో మూడో దశ ప్రయోగం కూడా రష్యా సిద్దమైనట్టు తెలుస్తోంది.

ప్రపంచ దేశాల ఒత్తిడితో దిగొచ్చిన రష్యా తాను అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్-వి’ని మూడో దశలో భాగంగా 40 వేల మంది వలంటీర్లపై ప్రయోగించాలని నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు, రష్యా వ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలపై తమకు సమాచారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది.

Related posts