telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రూ. 10 కోట్లతో మురళీధర్ బాగ్ లో నిర్మించి డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు ఉచితంగా నిర్మించి ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ, డైరీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని మురళీధర్ బాగ్ లో రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించిన 120 డబుల్ బెడ్ రూం ఇళ్ల భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభాకర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని రాష్ట్రంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు ఉచితంగా నిర్మించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా గోషామహల్ పరిధిలోని మురళీధర్ బాగ్ లో రూ. 10 కోట్లతో 120 ఇళ్లను మూడు బ్లాక్ లలో నిర్మించి లిఫ్ట్ సౌకర్యంతో పాటు మౌలిక సదుపాయాలైన అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదవారికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ఇక్కడ నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు అన్ని మౌలిక సదుపాయాలతో కార్పొరేట్ స్థాయిలో నిర్మించడం జరిగిందని తెలిపారు. అంతే కాకుండా ఇక్కడ నివాసం ఉంటున్న పేదవారి కోసం పది మడిగెలను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ మడిగెలను స్థానికంగా నివాసం ఉంటున్నవారికే కేటాయించి తద్వారా వచ్చిన ఆదాయాన్ని మెయింటెనెన్స్ కు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.  పేదవారిని ధనవంతులుగా చేసేందుకు వారి నుండి ఎటువంటి డబ్బులు తీసుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో డబుల్ బెడ్ రూం ఇంటికి రూ. 8లక్షలు ఖర్చు చేసిందని తెలిపారు. లాటరీ పద్దతిలో లబ్దిదారులకు 120 ఇళ్లను కేటాయించామని తెలిపారు. ఇందులో విశాలమైన హాల్, రెండు బాత్ రూం లు, కిచెన్, బాల్కని, రెండు బెడ్ రూం లు ఉన్నాయని తెలిపారు. కరెంట్ బిల్లు డబుల్ బెడ్ రూం కమిటీ ద్వారా అందరికీ సమానంగా కేటాయిస్తామని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను గతంలో జియాగూడ కట్టెల మండి నిర్మించామని తెలిపారు. ఈ డబుల్ బెడ్ రూం లు పొందిన లబ్దిదారులు తమ పిల్లలను  మంచిగా చదివించుకోవాలన్నారు. ఈ డబుల్ బెడ్ రూం కోటి రూపాయల విలువైనవని, వీటిని అమ్మినచో అమ్మినవారు, కొన్నవారి పై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. వృద్దులకు, వితంతు, ఒంటరి మహిళలకు రూ. 2వేల పింఛను, వికలాంగులకు రూ. 3 వేల పింఛను, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా లక్ష రూపాయలు అందిస్తుందన్నారు.

హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పేదవారికి ఎన్నో సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని తెలిపారు. విద్యుత్ నిరంతరాయంగా అందించడం ద్వారా పరిశ్రమలు పవర్ హాలీడేస్ లేకుండా పనిచేస్తున్నాయని తెలిపారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, ఆసరా పింఛన్లు, ఇంటింటికి ఉచిత త్రాగునీరు, సర్ ప్లస్ పవర్ ను అందించడం జరుగుతుందని తెలిపారు.

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ…. మురళీధర్ బాగ్ డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారులు మోజంజాహి మార్కెట్ లో వ్యాపారం చేస్తారని, వారికి ఇక్కడే షాపులను కేటాయించడం ద్వారా వ్యాపారాన్ని సులువుగా చేసుకోవచ్చని తెలిపారు. ప్రధాన మంత్రి అవాస్ యోజన, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా పేదవారికి సొంతింటి కలను నెరవేర్చడం జరిగిందని తెలిపారు. మరళీధర్ పక్కనే ఉన్న పేద ప్రజలకు వారి స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం రూ. 3 లక్షల సహాయం అందజేయాలని కోరారు.

ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాతి అని రూ. 10 కోట్లతో లబ్దిదారులకు ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గన్ ఫౌండ్రీ కార్పొరేటర్ బిశ్వ సురేఖ, జాం బాగ్ కార్పొరేట్ రాకేష్ జైస్వాల్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, ఎస్.ఇ లు సురేష్, విద్యాసాగర్, ఇ.ఇ వెంకట రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts