telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘రొమాంటిక్’ వచ్చేస్తుంది…

పూరి జగన్నాథ్ కుమారుడు పూరి ఆకాష్ హీరోగా ‘రొమాంటిక్’ పేరుతో ఓ కొత్త సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యువ డైరెక్టర్ అనిల్ పాదూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఆకాష్ పూరికి జంటగా ఉత్తరాది భామ కేతిక శర్మ నటిస్తోంది. రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  అయితే… తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది చిత్ర బృందం. జూన్‌ 18న ఈ మూవీ రిలీజ్‌ చేస్తామని చిత్ర బృందం పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేసింది.

Related posts