telugu navyamedia
సినిమా వార్తలు

తాప్సి “గేమ్ ఓవర్” ట్రైలర్

Game-Over

2015లో నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హార్రర్ థ్రిల్లర్ “మాయ”. అప్పట్లో విడుదలైన ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ హార్రర్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను “మయూరి”గా అలరించింది. ఈ సినిమాకు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించి, టాలెంటెడ్ దర్శకుడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ దర్శకత్వంలో తమిళంలో “గేమ్ ఓవర్” అనే మరో హారర్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తాప్సీ ప్రధానపాత్రను పోషిస్తోంది. గతకొన్ని రోజుల క్రితం ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి స్పందనే లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను నేడు రానా చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో ఆమెను భయపెడుతున్న ఆ భయం ఏమిటి అనే అంశమే సినిమాలో అసలైన కీ పాయింట్. ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠంగా సాగింది. జూన్ 14న “గేమ్ ఓవర్” సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts