telugu navyamedia
సినిమా వార్తలు

సూపర్ హిట్ వెబ్ సిరీస్ సీక్వెల్ లో సామ్

Samnatha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఇంటికి కోడలైనప్పటికీ గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గించలేదు. అదే గ్లామర్ తో అదే జోరుతో వరుస సినిమాలు చేసి భారీ హిట్లను తన ఖాతాలో వేసుకుంటోంది. అక్కినేని మూడోత‌రం వార‌సుడు నాగ‌చైత‌న్య‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత స‌మంత వ‌రుస స‌క్సెస్‌లు సాధిస్తుంది. ఇటీవ‌ల “మజిలీ”, “ఓ బేబి” చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన స‌మంత ప్ర‌స్తుతం “96” రీమేక్ చిత్రంలో న‌టిస్తుంది. త‌మిళ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు వ‌ర్షెన్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి జాను లేదా జానకి దేవి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. శ‌ర్వానంద్ చిత్రంలో కెమెరామెన్‌గా క‌నిపించ‌నున్నాడు. సెప్టెంబ‌ర్ 16 నుండి చిత్రానికి సంబంధించి మ‌రో షెడ్యూల్ మొద‌లు కానుంది. అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ తొలి వారంలో చిత్ర షూటింగ్ పూర్తి కానుంద‌ని అంటున్నారు. అయితే 96 రీమేక్ త‌ర్వాత కొద్ది రోజుల పాటు స‌మంత సినిమాల‌కి బ్రేక్ తీసుకొని మాతృత్వం పొందేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటుంద‌ని అంటున్నారు. కానీ ఇప్పుడు ఈమె తొలిసారి వెండితెర నుండి డిజిట‌ల్ మాధ్య‌మంలో న‌టించ‌నున్నార‌ని వార్త‌లు విన్పిస్తున్నాయి. తెలుగు ద‌ర్శ‌కుడు రాజ్‌, డీకే రూపొందిన వెబ్ సిరీస్ “ద ఫ్యామిలీ మేన్‌” మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంది. త్వ‌ర‌లోనే సీజ‌న్ 2 చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. ఇందులో స‌మంత అక్కినేని కూడా భాగం కానున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌నోజ్ బాజ్‌పాయ్‌, ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. ఇండియాలో విధ్వంసానికి టెర్ర‌రిస్టులు కుట్ర చేసిన‌ప్పుడు ఓ ఎన్‌.ఐ.ఎ ఏజెంట్ త‌న టీమ్‌తో ఎలా దాన్ని అడ్డుకున్నాడ‌నేదే ఈ వెబ్ సిరీస్‌. త్వ‌ర‌లోనే సీజ‌న్ 2 ప్రారంభం కానుంద‌ట‌.

Related posts