telugu navyamedia
క్రీడలు

ఐపీఎల్‌లో రోహిత్ శ‌ర్మ న్యూ రికార్డు..

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. రోహిత్ శర్మ ఐపీఎల్‌లో కేకేఆర్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. తొలి ఆటగాడిగా మారాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అబుదాబి వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 33 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఐపీఎల్‌లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు.

MI vs KKR 2021: Rohit Sharma needs 20 runs to complete 5500 runs in IPL

ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ వేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు బాదిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత సునీల్ నరైన్‌ని టార్గెట్‌ చేయబోయి లాంగాన్‌లో ఫీల్డర్ శుభమన్ గిల్ చేతికి చిక్కాడు. ఐపీఎల్​లో ఒక టీమ్‌పైనే 1000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్​గా రికార్డు నెలకొల్పాడు. వరుణ్ చక్రవర్తి వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదడంతో రోహిత్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ మ్యాచుకు ముందు కోల్​కతాపై హిట్‌మ్యాన్ 982 పరుగులు చేశాడు.

MI vs KKR: Rohit Sharma Crosses 1000 Runs Vs Kolkata First Player To Do It

ఈ జాబితాలో .. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై రోహిత్ శర్మ ఇప్పటి వరకూ 1011 పరుగులు చేయగా.. అతని తర్వాత స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ రికార్డ్‌లో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్‌పై వార్నర్ ఇప్పటి వరకూ 943 పరుగులు చేశాడు. అలానే కోల్‌‌కతాపై కూడా 915 పరుగులు చేసిన వార్నర్ మూడో స్థానంలోనూ కొనసాగుతున్నాడు. ఇక నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ 909 పరుగులచేశాడు.ఢిల్లీ బ్యాట్స్ మెన్ శిఖ‌ర్ ధావ‌న్ పంజాబ్ కింగ్స్ పై 894 ప‌రుగులు చేశాడు.

Related posts