telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఢిల్లీ కోర్టులో కాల్పులు..

దేశ రాజధానిలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఢిల్లీ రోహిణి కోర్టు ఆవరణలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు.ఈ ఘటనలో ఓ గ్యాంగ్​స్టర్​ సహా.. మొత్తం ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

వివార్లాలోకి వెళితే..

ఢిల్లీలోనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ జితేంద్ర అలియాస్​ గోగీని రోహిణీ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్నారు దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు. ఈ క్రమంలోనే.. అడ్వాకేట్ యూనిఫారమ్స్‌లో వచ్చిన దుండగులు గోగీపై కాల్పులు జరిపారు. 35 నుంచి 40 రౌండ్లు కాల్పులు జరుపుకొన్నట్లు తెలుస్తోంది. అయితే అత‌నిపై దాడి చేసిన ముగ్గుర్ని పోలీసులు హ‌త‌మార్చారు.. తీవ్ర గాయాలైన గోగీని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందినట్లు డీసీపీ తెలిపారు.

30 ఏళ్ల జితేంద్ర గోగి గత ఏప్రిల్‌లో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్ ఎంసీవో సీఏ కింద అరెస్టయ్యారు. హత్యలు, హత్యాయత్నం సహా మొత్తం 19 కేసులు జితేంద్రపై ఉన్నాయి. అయితే, కోర్టు వ‌ద్ద విచక్షణార‌హితంగా కాల్పులు జ‌రప‌టంతో సాధారణ వ్యక్తులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కోర్టుకు వ‌చ్చిన‌వారంతా ఆ కాల్పుల హోరులో అటూ ఇటూ ప‌రుగులు తీశారు.  కాల్పులు జరిపిన వెంటనే ఢిల్లీ రోహిణీ కోర్టులో భద్రతను పటిష్ఠం చేశారు. కోర్టులో అదనపు బలగాలను మోహరించారు.

కాల్పుల ఘటనపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రతి కోర్టు హాల్‌ ముందు మెటల్ డిటెక్టర్లు ఉండగా వాటిని తప్పించుకుని ఎలా ప్రవేశించగలిగారనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. రెక్కీ నిర్వహిస్తున్న సమయంలోనే లోపలి వ్యక్తులు ఈ దుండగులకు సహకరించారా అనే వివిధ కోణాల్లో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.  వ

Related posts