telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీ ఓపెనింగ్‌ పై రోహిత్ షాకింగ్ కామెంట్స్…

నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టీ 20 మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్‌ను 3-2తో కోహ్లీసేన కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రారంభించి దుమ్మురేపాడు. ఈ మ్యాచ్ అనంతరం‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ…. కోహ్లీ ఓపెనింగ్ రావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ఓపెనర్‌గా వస్తే నాకు అభ్యంతరం లేదు. మ్యాచ్‌ గెలవాలనే ప్రయత్నంలోనే ఇలాంటి ప్రయోగాలకు సిద్ధపడుతుంటాం. జట్టుకు మేలు చేసే అంశాలపై మేమంతా చర్చిస్తాం. విరాట్ కోహ్లీ ఓపెనింగ్ రావడం జట్టుకు మేలు చేస్తుందని భావిస్తే దాన్ని కొనసాగిస్తాం. జట్టుకు అవసరమైన దశలో ఒక బ్యాట్స్‌మన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఏ స్థానంలోనైనా వచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. అదే కోహ్లీ చేశాడు. బయట ఏం అనుకుంటున్నారనేది మాకు అనవసరం.. ఓపెనింగ్‌లో ఎవరు ఆడాలి.. ఎవరు ఆడకూడదనేది నిర్ణయించే హక్కు కెప్టెన్‌కు ఉంటుంది. ఫామ్‌లో ఉన్న ఆటగాడు ఓపెనర్‌గా వచ్చినా.. వన్‌డౌన్‌లో వచ్చినా ఆడేది మాత్రం అతనే కదా. ఇషాన్‌ కిషన్‌ ఓపెనర్‌గా సక్సెస్‌ అయ్యాడు.. కోహ్లీ కూడా సక్సెస్‌ అయ్యాడు. జట్టు ప్రయోజనాల కోసం కోహ్లీ ఓపెనర్‌గా వస్తే నాకు అభ్యంతరం ఎందుకుంటుంది అని హిట్ మ్యాన్ తెలిపాడు.

Related posts