telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నిర్భయ నేరస్తులకి .. రాష్ట్రపతి క్షమాబిక్ష పెడతారా.. !

is President's pardon available to nirbaya

అనుకోని పరిస్థితులలో నేరాలకు పాల్పడి శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు క్షమాబిక్ష కోసం రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకోవడం సహజంగా వస్తున్నదే. ఆయా నేరస్తుల పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, రాష్ట్రపతి కూడా క్షమించాలా లేదా అనేదానిపై నిర్ణయం తీసుకుంటారు. అదే నేపథ్యంలో కొందరికి క్షమాపణ లభించడం, వాళ్ళ శిక్ష తగ్గించడం లేదా విడుదల చేయడం లాంటివి జరుగుతుంటాయి. అయితే ఇటీవల మహిళలు, చిన్నారులపై జరుగుతున్న హేయమైన అకృత్యాల నేపథ్యంలో పోస్కో చట్టం రూపుదిద్దుకుంది. దానితో ఆగుతాయనుకున్న అఘాయిత్యాలు ఆగకపోగా పెరిగాయనే చెప్పాలి. మరి ఇటువంటి వాటిలో శిక్ష పడిన వారికి కూడా రాష్ట్రపతి క్షమాబిక్ష పెడతారా.. అనేది ప్రస్తుత చర్చ.

దీనికి కారణం నిర్భయ కేసులో మరణశిక్ష పడి, ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్న వినయ్‌శర్మ… రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం పిటిషన్‌ దాఖలు చేసినట్టు జైలు అధికారులు శుక్రవారం వెల్లడించారు. 2012లో పారామెడికల్‌ విద్యార్థినిపై బస్సులో పాశవికంగా అత్యాచారం చేసి, ఆమె మృతికి కారణమైన ఆరుగురిలో ఒకరు జైలులో ఆత్మహత్య చేసుకోగా, మరొకడు బాల నేరస్థుడు. మిగిలిన దోషులకు సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. బహుశా మానవ హక్కుల సంఘాలు కూడా ఈ విషయానికి మద్దతు పలకవని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే యువత ఇటువంటి మానసిక పరిస్థితికి రావడానికి చుట్టూ ఏర్పడుతున్న సమాజ స్థితిగతులు కారణం కాబట్టి, ఆ సమాజం లో మార్పులు తప్పనిసరి, లేదంటే ఈ నేరాలు, శిక్షలు ఆపడం సాధ్యం కానిపని.. క్షమాభిక్షకు కూడా అదే దారి!

Related posts