ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా – లఖ్‌నవూ యమున ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డు నుంచి వెళ్తుండగా మార్గ మధ్యలో వంతన పైనుంచి బస్సు జర్న నాలాలో పడిపోవడంతో 29 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.