telugu navyamedia
సినిమా వార్తలు

ఈ ఇద్దరూ ఎవరో చెప్పుకోండి చూద్దాం… : వర్మ

RGV

రామ్ గోపాల్ వర్మ అనే పేరు వినగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది వివాదం. సోషల్ మీడియాలో తనదైన శైలిలో వివాదాస్పద పోస్టులతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు వర్మ. ప్రస్తుతం దివంగత ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు వర్మ. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన రెండు పాటలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. ఇటీవల వరుసగా సినిమా నుంచి ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి, చంద్రబాబు నాయుడు పాత్రల లుక్స్ విడుదల చేశారు. తాజాగా వర్మ తన అభిమానులను ఓ ఫోటో విడుదల చేస్తూ ఆ ఫోటోలో ఉన్న ఇద్దరూ ఎవరో చెప్పుకోవాలని అడిగారు. ఆ ఫొటోలో ఎన్టీఆర్ పాత్రధారి దీర్ఘాలోచనలో ఉండగా, వెనుకవైపు చంద్రబాబు ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ పిక్ పై నెటిజన్లు తమ స్పందన తెలియజేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ఈ ఫోటోను షేర్ చేశారు.

Related posts