telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు”పై వర్మ సంచలన నిర్ణయం… ఇక సెన్సార్ అవసరం లేదు

KRKR

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అన్న విషయాన్ని ఊహించి వర్మ తెరకెక్కించిన సినిమా “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు”. ఈ సినిమాలో ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడుతో సహా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్, కేఏ పాల్‌ను పోలిన పాత్రలు ఉన్నాయి. సిద్ధార్థ్‌ తాతోలుతో కలిసి వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్‌, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ముందుగా ఈ సినిమాకు “కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశాడు వర్మ. అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు రావటంతో పాటు సెన్సార్‌ ఇబ్బందులు కూడా ఎదురవుతాయన్న అనుమానంతో వర్మ సినిమాను టైటిల్‌ను మార్చాడు. అయితే టైటిల్‌ మార్చినా ఇబ్బందులు మాత్రం తప్పలేదు. ఈ సినిమాలో ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న నాయకులను పోలిన పాత్రలు ఉండటంతో సెన్సార్‌ సభ్యులు సినిమాకు 90కి పైగా కట్స్‌ సూచించారు. అయితే సెన్సార్‌ బోర్డ్‌ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వర్మ రివైజింగ్‌ కమిటీని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధాన పాత్రలకు సంబంధించిన సన్నివేశాల విషయంలో కట్స్‌ చెప్పటంపై వర్మ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. సెన్సార్‌ సభ్యుల తీరుపై ఫైర్‌ అయిన వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ఎలాంటి కట్స్‌ లేకుండా డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నాడట వర్మ. ప్రస్తుతం డిజిటల్‌ మీడియాకు ఎలాంటి సెన్సార్‌ లేదు కాబట్టి వర్మ తీసిన సినిమాను ఎలాంటి కట్స్‌ లేకుండా ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమానే కావటంతో కేవలం డిజిటల్‌ రైట్స్‌తోనే వర్మకు లాభాలు వస్తాయంటున్నారు విశ్లేషకులు.

Related posts