telugu navyamedia
సినిమా వార్తలు

ముగిసిన రవితేజ ఈడీ విచారణ

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో హీరో రవితేజ విచారణ ముగిసింది.. దాదాపు 5 గంటలకు పైగా రవితేజను ప్రశ్నించారు ఈడీ అధికారులు. మనీల్యాండరింగ్‌కు సంబంధించిన విషయంలో దర్యాప్తు బృందం ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇక, ఈడీ విచారణలో రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్‌ కూడా కీలకంగా మారాడు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ముందుగా పట్టుబడింది శ్రీనివాసే. అతడిని ఎక్సైజ్‌ ప్రత్యేక బృందం విచారించడంతో కెల్విన్‌ పేరు తెరపైకి వచ్చింది.. వీరి ఇద్దరినీ విచారించడంతో.. టాలీవుడ్‌ స్టార్స్ డ్రగ్స్‌ వినియోగం బటపడింది. శ్రీనివాస్ ద్వారా నటీనటులకు డ్రగ్స్‌ సరఫరా అయినట్టు అధికారులు గుర్తించారు.

ఈరోజు ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు రవితేజ.. 11 గంటలకు విచారణ ప్రారంభమైంది.. ఇక, రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఉదయం 9 గంటలకే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 5 గంటల పాటు విచారణ సాగింది. అయితే, ఈ విచారణ సమయంలో గతంలో ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసిన కెల్విన్‌ స్నేహితుడు జిషాన్‌ను ఈడీ కార్యాలయానికి రప్పించారు.

ఈడీ విచారణలో రవితేజకు సంబంధించిన ఐదేళ్ల బ్యాంకు లావాదేవీలను పరిశీలించినట్టుగా తెలుస్తోంది. విచారణ అనంతరం మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ… ఆయన మాట్లాడకుండానే వెళ్లిపోయారు. విచారణ సందర్భంగా బ్యాంకు వివరాలు, డ్రైవర్ శ్రీనివాస్ ద్వారా జరిపిన లావాదేవాలపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఈసందర్భంగా రవితేజ హామీ ఇచ్చారు.

 

Related posts