telugu navyamedia
సినిమా వార్తలు

మరో హిట్​ రీమేక్​లో వెంకీ ​!

హీరో వెంకటేశ్​ మరో హిట్​ రీమేక్​కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన ‘అసురన్’​ తెలుగు రీమేక్​ రూపొందిన ‘నారప్ప’ ఓటీటీలో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇందులోని వెంకీ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.ఈ క్రమంలోనే వెంకీ మరో రీమేక్​ చేయాలనే ఆలోచనలో పడ్డారట.

Venkatesh Daggubati Gets Injured on the Sets of Venky Mama, Shoot of KS Ravindra's Directorial Come to a Halt | 🎥 LatestLY

తమిళ స్టార్​ అజిత్​ నటించిన సూపర్​ హిట్ చిత్రం ‘ఎన్నై అరిందాల్’​ను తెలుగులో చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. గౌతమ్​ మీనన్​ దర్శకత్వంలో 2015లో విడుదలైన ఈ మూవీ తెలుగులో ‘ఎంతవాడుగానీ’ పేరుతో డబ్​ అయి పాజిటివ్​ టాక్​ తెచ్చుకుంది. ఇప్పుడు ఇదే చిత్ర రీమేక్‌లో వెంకీ నటించబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Naga Rohith™ on Twitter: "Happy Birthday To TALA Ajith On Behalf Of All Venkatesh Fans... 😊😎 @ThalaAjith_FC @ajithFC #HBDBelovedThalaAjith 🎂… "

కాగా.. ప్రస్తుతం వెంకటేశ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ‘ఎఫ్3’లో నటిస్తున్నారు

Related posts