telugu navyamedia
తెలంగాణ వార్తలు

సీఎం కేసీఆర్ మళ్లీ అబద్ధాలు ఆడుతున్నారు- రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ మళ్లీ అబద్ధాలు ఆడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‎రెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో 91 వేల పై చిలుకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్‌ కార్యకర్తలు తదితరులు కేసీఆర్‌ చిత్రపటానికి పాలభిషేకాలు, నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌పై రేవంత్‎రెడ్డి స్పందిస్తూ.. పాలాభిషేకం చేసే వాళ్ళకి పిచ్చి ముదిరిందని ఆయన అన్నారు. కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన మాత్రమే చేసాడు. ఖాళీలు ఎప్పటి లోపు భర్తీ చేస్తారో చెప్పలేదని సెటైర్‌ వేశారు.

2014లో గతంలో లక్ష ఏడూ వేలు ఖాళీలు ఉన్నాయని, మరొక 50 వేలు ఖాళీ కాబోతున్నాయని 7 సెప్టెంబర్ 2014 చెప్పారన్నారు. లక్ష 50 వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు.. బిస్వాల్ కమిటీ లక్ష 91 వేలు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు.

39 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇవాళ సభ లో కేసీఆర్ అబద్ధాలు చెప్పాడని, లక్ష 50 వేలు ఖాళీలు ఉన్నాయని, 80 వేలు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ప్రకటించాడన్నారు.

మేము అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు 2 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పీ కె ఇచ్చిన అబద్ధాలు ప్రకటన ను కేసీఆర్ చదివాడు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.

Related posts