telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

జమ్మికుంట పోలీస్టేషన్ కు దేశంలో అరుదైన గౌరవం….

దేశంలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ జాబితాను తాజాగా భారత హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే అందులోని మొదటి పది స్థానాల్లో తెలంగాణ రాష్ట్రం లో కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్ పదవ స్థానం లో నిలిచింది. దీంతో రాష్ట్ర డి జి పి మహేందర్ రెడ్డి జిల్లా పోలీసులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ వ్యాప్తంగా మొత్తం పదహారు వేలకు పైగా పోలీస్ స్టేషన్ ల లో పది పోలీస్ స్టేషన్ లను ఉత్తమ పోలీస్ స్టేషన్ లుగా ప్రతి సంవత్సరం హోం శాఖ ప్రకటిస్తుంది. గత సంవత్సరం ఇదే జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్. కు ఎనిమిదవ స్థానం రాగ ఈ సంవత్సరం జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు పదవ స్థానం రావడం టో కరీంనగర్ సి పీ కమలహాసన్ రెడ్డి జమ్మికుంట పోలీస్ సిబ్బంది కి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపిక కావడం తో సి పి కమలహాసన్ రెడ్డి , ACP శ్రీనివాసరావు జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు వచ్చి సీఐ సృజన్ రెడ్డి ఎస్సై లను పోలీస్ సిబ్బంది నీ ప్రశంసించారు. ఇక జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపిక కావడం పట్ల రాష్ట్ర డి జి పి మహేందర్ రెడ్డి టో పాటు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఈటల రాజేందర్,గంగుల కమలాకర్ జిల్లా పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారన్నారు.

Related posts