telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జూన్ 27న వర్మ “నగ్నం” మూవీ విడుదల

Nagnam

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓటిటి ద్వారా జీఎస్టీ సుందరి మియా మాల్కోవా “క్లైమాక్స్” సినిమా రిలీజ్ చేసి భారీ లాభాలు పొందాడు. తాజాగా “నగ్నం” సినిమా తీస్తున్నట్టు ప్రకటించాడు. సినిమా ప్రకటిన వెలువడిన రోజుల వ్యవధిలోనే ఇదిగో ట్రైలర్ అంటూ షాక్ ఇచ్చాడు వర్మ. ఆ ట్రైలర్ చూసిన నెటిజన్లు వర్మ క్రియేటివిటీకి ఫిదా అయ్యారు. సినిమా కథ కంటే అమ్మాయి అందాలను చూపించడంపైనే వర్మ ఎక్కువగా ఫోకస్ పెట్టాడని ట్రైలర్స్ చూస్తే అర్ధం అవుతున్నది. ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేస్తే, పేర్లు, చివర్లో శుభం తప్పా మధ్యలో సినిమా ఏమి ఉండదు. అందుకే వర్మ తన వరల్డ్ మూవీస్ సినిమా ద్వారా రిలీజ్ చేస్తున్నాడు. ఒటిటి ప్లాట్ ఫామ్ కాబట్టి సెన్సార్ అవసరం లేదు. అందంపై తనకున్న ప్రేమను వర్మ ఇలా నగ్నంగా చూపించబోతున్నాడు. ఆ నగ్నత్వం నెటిజన్లను ఎంతవరకు ఆకర్షించింది అన్నది జూన్ 27న తేలుతుంది. సీక్రెట్ గా చూడాల్సిన సినిమా కాబట్టి వర్మ దీనిని రాత్రి సమయంలో రిలీజ్ చేస్తున్నాడు.

Related posts