telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

మళ్ళీ వరుస .. నష్టాలలో .. స్టాక్ మార్కెట్లు .. బాగా కుదేలైన ఐటీ ..

husge loses again in stock markets

వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీల్ తదితర కంపెనీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం మార్కెట్లపై ప్రభావాన్ని చూపించింది. వాస్తవానికి ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే ఉన్నాయి. చివరి అర గంటలో ఐటీ దిగ్గజాలతో పాటు హిందుస్థాన్ యూనిలీవర్ వంటి కంపెనీలు కూడా అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో లాభాలన్నీ వేగంగా పతమై, నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 18 పాయింట్ల నష్టపోయి 38,963కు పడిపోయింది. నిఫ్టీ 12 పాయింట్లు పతనమై 11,712 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (3.11%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.84%), ఎన్టీపీసీ (1.65%), టాటా మోటార్స్ (1.13%), యస్ బ్యాంక్ (1.04%).

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-3.70%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.04%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.40%), టాటా స్టీల్ (-1.31%), ఇన్ఫోసిస్ (-0.84%).

Related posts