telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాబాయ్‌ మూవీలో అబ్బాయి..!

Balakrishna

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ “బిబి-3” పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన బీబీ 3 టీజర్‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్, కరోనా కారణంగా వాయిదా పడగా, త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అయితే.. ఈ సినిమా నుంచి ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఈ మూవీలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ గెస్ట్‌ రోల్‌ చేస్తాడని టాక్‌ వినిపిస్తోంది. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో ఇంటర్వెల్‌ లో ఎంట్రీ ఉంటుందని టాక్‌ నడుస్తోంది. ఈ మూవీలో కొత్త హీరోయిన్‌ ఇండస్ట్రీకి పరిచయం కానుంది. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండగా… బీబీ3 పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Related posts